మెగా ఫ్యామిలీ తో సాయి ధరమ్ తేజ్… యాక్సిడెంట్ తరవాత తొలిసారి..!

యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి సాయి ధరమ్ తేజ్ తెరపైకి వచ్చాడు. దీపావళి సందర్భంగా మెగా ఫ్యామిలీతో తేజ్ దిగిన ఫోటోను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి తో పాటు పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కూడా ఉన్నారు. ఇక మెగాస్టార్ ట్వీట్ కు సాయి ధరమ్ తేజ్ రిప్లై ఇస్తూ నా పునర్జన్మ కి కారణమైన మీ ప్రేమకు మీ ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను.

నీ ప్రేమను పొందడం నా పూర్వజన్మ సుకృతం అంటూ ఎమోషన్ అయ్యారు. ఇక ఈ ఫోటో చూస్తుంటే తేజ్ పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా సాయిధరమ్ తేజ్ బైక్ నడుపుతూ స్కిడ్ అవ్వడం వల్ల కింద పడి పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. అతడి కాలర్ బోన్ విరిగిపోవడంతో అపోలో ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. దాంతో అప్పటి నుంచి రెస్ట్ తీసుకుంటున్నారు. ఇక తాజాగా ఆయన కనిపించడంతో అభిమానులు కుషీ అవుతున్నారు.