బ్యాడ్మింటన్ కు గుడ్ బై చెప్పనున్న సైనా నెహ్వాల్..?

-

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్, వరల్డ్ మాజీ నెం.1 ర్యాంకర్​ 34ఏళ్ల సైనా నెహ్వాల్ తన కెరీర్​కు గుడ్ బై చెప్పే  ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తాజాగా రిటైర్మెంట్​పై సైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె ఆర్థరైటిస్​తో బాధపడుతుందట. దీంతో ఈ ఏడాది చివరి నాటికి కెరీర్ గురించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని  వెల్లడించింది. ఈ మేరకు ‘హౌస్ ఆఫ్ గ్లోరీ’ పాడ్​కాస్ట్​లో తాజాగా పాల్గొన్న సైనా ఆసక్తికర కామెంట్స్  చేసింది.

“నా మొకాలు అంతగా బాగాలేదు. కీళ్ల నొప్పులు కూడా వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో 8-9 గంటలు ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం అవుతుంది. ప్రపంచలోని అత్యుత్తమ ఆటగాళ్లతో పోటీ పడాలంటే 2 గంటల ప్రాక్టీస్ అస్సలు సరిపోదు. అందుకే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నా. అది కాస్త బాధగానే ఉంటుంది. కానీ, క్రీడాకారుల కెరీర్​ చాలా తక్కువ సమయమే కదా. నేను 9ఏళ్ల వయసున్నప్పుడు కెరీర్ ప్రారంభించాను.  వచ్చే సంవత్సరానికి నాకు 35 ఏళ్లు వస్తాయి. సుదీర్ఘ కాలంపాటు నేను బ్యాడ్మింటన్​ ఆడాను. నా కెరీర్​లో సాధించిన దానిపట్ల ఎప్పుడు గర్వంగానే ఉంటా. ఈ ఏడాది చివరి నాటికి నా పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటా” అని తెలిపింది సైనా నెహాల్.

Read more RELATED
Recommended to you

Latest news