Saindhav Movie : వెంకీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్!

-

విక్టరీ వెంకటేష్ హీరోగా హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సైంధవ్.

యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ బోయిన్పల్లి నిర్మిస్తున్నాడు. వెంకటేష్ కి ఇది 75 వ చిత్రం కావడం విశేషం.జనవరి 13న సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళం, హిందీ,మలయాళం, కన్నడ, భాషల్లో విడుదలకు సిద్ధమవుతుంది. ఇదివరకే విడుదలైనటువంటి ట్రైలర్ ,టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది . విడుదల తేదీ దగ్గర పడుతున్నా నేపథ్యంలో ఇప్పటికే మొదలుపెట్టిన ప్రమోషన్స్ కి ఊహించని రేంజ్ లో స్పందన వస్తుంది..అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లోని ఆర్ కే బీచ్ వ‌ద్ద ఉన్న గోకుల్ పార్కులో జ‌న‌వ‌రి 7న‌ సాయంత్రం 5.30 గంట‌ల నుంచి జ‌రుగ‌నుంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news