చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో సిఐడి అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉంచారు, రేపటితో రిమాండ్ గడువు కూడా ముగియనుంది. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ సరైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేశారు.. ఇది తెలియకుండా టీడీపీ ఎందుకు డ్రామాలు ఆడుతోందంటూ ఫైర్ అయ్యారు. గతంలో స్కిల్ డెవలప్మెంట్ లో నిధులలో అవినీతి జరిగిందని GST అధికారులు పక్కా ఆధారాలతోనే నోటీసులు పంపించారు, అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆదేశాలు ఇవ్వడం కారణంగానే ఆ నిధులను విడుదల చేసినట్లు అధికారులు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీ నేతలకు కౌంటర్ ఇచ్చాడు. ఇకనైనా అర్ధం లేని వాదనలు ఆపాలంటూ టీడీపీ నేతలకు చెప్పారు సజ్జల.. త్వరలోనే కోర్టు లు ఈ కేసులో జరిగిన అసలు విషయాలను తీర్పు రూపాల్లో తెలియచేస్తారు అంటూ చెప్పారు.
కాగా ఈ కేసులో సుప్రీమ్ కోర్ట్ లో చంద్రబాబు తరపున లాయర్లు వేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును రిజర్వు చేసినట్లుగా తెలిపింది.