ఐసీసీ వన్ డే ర్యాంకింగ్ లో దుమ్ము దులిపిన టాప్ 3 ఇండియా ప్లేయర్స్ !

-

ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న వన్ డే వరల్డ్ కప్ లో ఇండియా అదరగొడుతోంది. ఇప్పటి వరకు ఇండియా ఆడిన మూడు మ్యాచ్ లలో వరుసగా ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్ మరియు పాకిస్తాన్ లను చిత్తు గా ఓడించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఇండియా తర్వాత మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ లోనూ ఇండియాకు ఎక్కువ గెలుపు అవకాశాలు ఉంటాయి. కాగా తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్ డే ర్యాంకింగ్ లో ఇండియాకు చెందిన టాప్ 3 ప్లేయర్స్ అదరగొట్టారు అని చెప్పాలి. ఎప్పటిలాగే శుబ్మాన్ గిల్ రెండవ రాంక్ లో ఉండగా, కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆటతీరును కనబరుస్తూ 6వ ర్యాంక్ ను సాధించాడు. ఇక వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చే విరాట్ కోహ్లీ 8వ ర్యాంక్ ను తెచ్చుకున్నాడు.

ఇండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్ 10 లో ఉండడం విశేషం. ఇక బాబర్ ఆజం టాప్ 1 ర్యాంక్ ను చేజిక్కించుకుని ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ పూర్తయ్యే లోపు టాప్ 1 లో ఇండియా ప్లేయర్ ఉండడం కంఫర్మ్.

Read more RELATED
Recommended to you

Latest news