ఏపీ ఉద్యోగులను క్రమశిక్షణలో పెడతాం : సజ్జల

-

ట్రెజరీ ఉద్యోగులు మెడ మీద కత్తి పెట్టడం వల్ల నోటీస్ పీరియడ్ కు అర్థం ఉండదని… అలానే చేస్తే ఉద్యోగులను ప్రభుత్వం క్రమశిక్షణ లో పెట్టె ప్రక్రియ ప్రారంభం అవుతుందని సజ్జల రామకృష్ణ రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుండి ప్రభుత్వ నిర్ణయాన్ని నచ్చ చెప్పే ప్రయత్నం లో భాగంగా ఈ కమిటీ అని.. దానిలో భాగంగా వారిని రావల్సిందిగా నిన్న సమాచారం ఇచ్చామన్నారు.

జిఓలు అభయన్స్ లో పెట్టాలన్నారని.. కమిటీని అధికారికంగా ప్రకటించే వరకు వచ్చేది లేదన్నారని పేర్కొన్నారు. అయితే తాము రేపు మరల వారితో చర్చల కోసం వస్తామని… మరో సారి చర్చలకు రావాల్సిందిగా సమాచారం ఇస్తామని స్పష్టం చేశారు. జీఏడీ సెక్రటరీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత అధికారిక కమిటీ కాదని ఎలా చెబుతారని.. ఉద్యోగస్తులు కూడా మా ప్రభుత్వంలో భాగమేని వెల్లడించారు. ఏ సీరియస్ నిర్ణయం తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నామని.. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో ఏం చేసిందో ప్రజలకు వివరించటం తప్పెలా అవుతుందన్నారు. సమ్మె నోటీస్ ఇచ్చినా ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news