సజ్జనార్ సంచలన నిర్ణయం.. ఆర్టీసీ బస్సుల పై పోస్టర్లు బ్యాన్

రాచ కొండ సి పి పదవి నుంచి ఇటీవలే సజ్జనార్ తప్పుకున్న సంగతి తెలిసిందే. రాచకొండ సిపి పదవి నుంచి తప్పుకున్న సజ్జనర్.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి గా పదవీ బాధ్యతలు చేపడుతారు. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సర్కార్ సజ్జనార్ ఆర్టీసీ ఎండి గా నియమించింది. అయితే ఆర్టీసీ ఎండి గా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు తగిన కృషి చేస్తున్నారు సజ్జనార్. ఇందులో భాగంగానే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఆర్టీసీ ఎండి సజ్జనర్. ఆర్టీసీ బస్సుల పై అశ్లీల పోస్టర్లను నిషేధిస్తూ తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటినుంచి అభ్యంతరకర మరియు అశ్లీల ప్రకటనలు ఆర్టీసి బస్సులపై కనిపించవని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే బస్సులపై అలాంటి పోస్టులు ఉంటే తక్షణమే తొలగించాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు సజ్జనార్.