చార్‌ధామ్ యాత్రికుల‌కు శుభ‌వార్త.. నిషేధం ఎత్తివేత, కానీ..

-

Chardham Yatra: చార్‌ధామ్ యాత్రికులకు ఓ శుభ‌వార్త‌.. ఎప్పుడెప్పుడూ చార్ ధామ్ ద‌ర్శనం చేసుకుంటామా అనే ఎదురుచూస్తున్న భక్తుల కోరిక తీర‌నున్న‌ది. ఈ యాత్ర‌పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్న‌ట్టు గురువారం ఉత్త‌రాఖండ్ హైకోర్టు కీల‌క తీర్పునిచ్చింది. అయితే.. ఈ యాత్ర‌కు భక్తుల‌ను అనుమతించినప్పటికీ, ఆలయాలను సందర్శించే భక్తుల సంఖ్యపై రోజువారీగా పరిమితి విధించాలన్నది.

క‌రోనాను దృష్టిలో పెట్టుకుని చార్ ధామ్ యాత్ర‌కు (కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) వ‌చ్చే భ‌క్తులు క‌రోనా మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. రోజువారిగా కేదార్‌నాథ్ ఆలయంలో 800 మంది భక్తులు, బద్రీనాథ్ ఆలయంలో 1200 మంది, గంగోత్రిలో 600 మంది, యమునోత్రి ధామ్‌లో 400 మంది భక్తులను మాత్రమే అనుమతించాని హైకోర్టు తెలిపింది.

యాత్ర‌కు వ‌చ్చే భక్తులకు త‌ప్ప‌ని స‌రిగా కరోనావైరస్ పాజిటివ్‌ రిపోర్టులు, రెండో డోసుల టీకా తీసుకున్న సర్టిఫికేట్‌ను సంబంధింత అధికారుల‌కు స‌మర్పించాల‌ని కోర్టు ఆదేశించింది. కరోనా వైర‌స్ వ్యాప్తి జ‌రగ‌కుండా… నిర్వాహకులు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపింది.

క‌రోనా విజృంభ‌న కాస్త త‌గ్గినందున భక్తులు యాత్రకు అనుమతించాలని, యాత్రకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి ఎందరో జీవిస్తున్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం బెంచ్ ముందు పిటిషన్‌ దాఖలు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news