నానాటికీ పెరుగుతున్న సైబర్ క్రైం దాడుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలంటూ టీజీఎస్ఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎండీ సజ్జన్నార్ సూచించారు. ఇటీవల కాలంలో తన దృష్టిలోకి వచ్చిన సైబర్ క్రైమ్ విషయాలపై ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు కొత్త రకం దోపిడీకి పాల్పడుతున్నారని అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందే హెచ్చరించారు.
డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ కేటుగాళ్లు ప్రజలకు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జన్నార్ ప్రజలను ముందే అప్రమత్తం చేశారు. ‘పోలీసులు, ఎన్సీబీ, సీబీఐ, ఆర్బీఐ అధికారులం అంటూ సైబర్ నేరస్థులు కాల్స్ చేస్తున్నారు. డిజిటల్ అరెస్టులో ఉన్నారంటూ నమ్మించి డబ్బులు కొట్టేస్తున్నారు. చట్టంలో అలాంటి డిజిటల్ అరెస్టు ఏమీ లేదని, ఎవరైనా ఇలా కాల్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి’ అని చెప్పారు.