చాలా మంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. పొట్ట కింద కొవ్వు ఉండడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉందా…? తగ్గించుకోవాలి అని అనుకుంటున్నారా..? అయితే ఈ విధంగా అనుసరించండి. దీనితో మీకు ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ప్రతి రోజు మీరు సజ్జ రొట్టెలు కనుక తింటే కచ్చితంగా బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది.
సజ్జ పిండిలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. పొట్ట కింద కొవ్వు తగ్గించడానికి కూడా ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. సజ్జ రొట్టెలు డయాబెటిస్ తో బాధపడే వారికి మరింత మంచిది.
దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కనుక జీర్ణ సమస్యలు లేకుండా చూసుకుంటుంది. కాబట్టి ప్రతి రోజూ మీరు మీ డైట్ లో వీటిని తీసుకుంటే ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించుకో వచ్చు.
అయితే మరి సజ్జ రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావలసిన పదార్ధాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం.
సజ్జ రొట్టెలకి కావలసిన పదార్థాలు :
- సజ్జ పిండి
- వేడినీళ్లు
- నెయ్యి
తయారు చేసుకునే విధానం :
ముందుగా సజ్జ పిండి తీసుకొని అందులో వేడి నీళ్ళు వేయండి ఇప్పుడు చపాతి పిండిలా ఒత్తుకోవాలి. మెత్తగా పిండిని మొత్తం కలుపుకోండి. నెక్స్ట్ చపాతీలా ఒత్తుకున్నాక రెండు వైపులా కూడా కొద్దిగా నెయ్యి వేసి కాల్చుకోవాలి. వేడి వేడిగా ఈ రొట్టెలు తింటే బాగుంటుంది.
బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి చిట్కాలు