బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఇలా చెయ్యాల్సిందే…!

బెల్లీఫ్యాట్ తో బాధ పడుతున్నారా..? అయితే తప్పకుండా ఈ చిట్కాలను పాటించండి. దీనితో కొవ్వు కరిగిపోతుంది. ఆయుర్వేద నిపుణులు ఈ రోజు మనతో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నారు మరి వాటి కోసం తెలుసుకుందాం. ఇక ఆలస్యమెందుకు దీనికోసం పూర్తిగా చూసేయండి. బరువు తగ్గడానికి, బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడానికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడుతాయి.

నిమ్మ:

నిమ్మ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు మనం పొందొచ్చు. ఈ సమస్య నుండి బయట పడాలంటే నిమ్మ బాగా సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. చర్మాన్ని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అజీర్తి సమస్యలు వంటివి కూడా నిమ్మ తొలగిస్తుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. మెటబాలిజంను కూడా ఇదే పెంపొందిస్తుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ తో బాధ పడే వాళ్ళు నిమ్మని తీసుకోవడం మంచిది.

యాలుకలు:

కొవ్వు కరిగించడంలో యాలకులు బాగా పని చేస్తాయి. ఆహారం తీసుకున్న తర్వాత యాలుకలు తీసుకోవడం వల్ల కొవ్వు కరుగుతుంది. ఎక్కువ తిన్నప్పుడు యాలుకలని వెంటనే తెలుసుకోండి. మెటబాలిజంను పెంచుతాయి. బరువు కూడా తగ్గవచ్చు

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కలో కూడా మంచి గుణాలు ఉన్నాయి. ఔషధ గుణాలు ఉన్న ఈ దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల బరువు తగ్గొచ్చు. మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ తినకుండా ఇది అదుపు చేస్తుంది. క్రేవింగ్ నుండి ఇది కంట్రోల్ చేస్తుంది.