తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. చిన్నపిల్ల అశ్లీల వీడియోలను ఓ ముఠా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తోంది. దాంతో పోలీసులు నింధితులను అరెస్ట్ చేశారు. తిరుపతి ఎస్పీ అప్పల నాయుడు తెలిపిన వివరాల ప్రకారం…ఇప్పటివరకూ 31 చిన్నపిల్లల అశ్లీల వీడియోలు అప్లోడ్ చేసినట్టు గుర్తించి నింధితులను అరెస్ట్ చేశామని చెప్పారు. నింధతులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తామని అన్నారు. ఒకవేళ వీడియోలు అప్లోడ్ చేసి డిటీట్ చేసినా కూడా వారి సమాచారం అందుతుందని అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

దేశంలో ఎక్కడనుండి వీడియోలు అప్లోడ్ చేసినా సీఐడీకి సమాచారం వెళుతుందని వారినుండి పోలీసులకు సమాచారం అందుతుందని చెప్పారు. వారిని పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పారు. ప్రస్తుతం 30 మందిని గుర్తించామని…వారిలో కొంతమంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారని చెప్పారు. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ప్లోయిడ్ చిల్డ్రన్ (ఎన్సీఎంఈసీ)తో కలిసి రాష్ట్ర పోలీసు శాఖ పనిచేస్తోందని ఎస్పీ అన్నారు.