కేజిఎఫ్ చాప్టర్ 1 మరియు చాప్టర్ 2 సినిమాలతో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఆ తరువాత మరో మాస్ మసాలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి యజ్ఞం చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి సలార్ ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి అయ్యి సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న మేకర్స్ బాగా లోచించి ఒక తేదీని లాక్ చేశారు. కాసేపటి క్రితమే ప్రభాస్ అభిమానులకు ఈ శుభవార్తను అందించారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.