ప్రభాస్ సలార్ లో నటించాలని ఉందా ? టీమ్ బంపర్ ఆఫర్

-

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హాంబలే ఫిలింస్ పతాకంపై సలార్ పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ మూడు సినిమాలని లైన్లో పెట్టిన ప్రభాస్, నాలుగవ సినిమాగా సలార్ ని తీసుకువచ్చాడు. సినిమా ప్రకటన వచ్చే వరకు ఎలాంటి పుకార్లు రాని ఈ సినిమాపై, తాజాగా అనేక రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

prabhas
prabhas

ఇక తాజాగా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉన్న వారు అందరికి శుభవార్త చెప్పింది యూనిట్. సలార్ సినిమాలో నటించాలని ఆశగా ఉన్నవారు అందరూ డిసెంబర్ 15న  9 AM to 6 PM వరకూ శేరిలింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది సినిమా యూనిట్. వయసుతో సంబంధం లేదని పేర్కొన్నారు. త్వరలోనే బెంగళూరు, చెన్నైలలో కూడా ఆడిషన్స్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news