స్టార్ హీరో సినిమా అంటే.. సెట్స్‌పైనే మినిమం ఆరు నెలలు వుండాల్సిందే. ఒక్కోసారి ఏడాది రెండేళ్లు కూడా పడుతుంది. కానీ… సల్మాన్ ఖాన్ సినిమా మాత్రం 60 రోజుల్లో పూర్తయింది. ఇంత స్పీడ్‌గా పూర్తిచేసుకున్న ఈ సినిమా పై బాలీవుడ్ లో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.
సల్మాన్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వంలో నటిస్తున్న రాధే మూవీ మే 13న రిలీజ్ అవుతోంది. కలిసొచ్చిన రంజాన్‌కు వస్తూ.. హిట్‌పై కన్నేశాడు . ఇక షారూక్ నటిస్తున్న పఠాన్ మూవీలో 15 నిమిషాలపాటు గెస్ట్ రోల్లో మెరవనున్నాడు సల్మాన్.
సల్మాన్ పోలీస్ అధికారిగా నటిస్తూ.. సొంత బేనర్ ఎస్‌కెఎఫ్‌లో ‘అంతిమ్’ మూవీ నిర్మిస్తున్నాడు. నటుడు, దర్శకుడు మంజ్రేకర్ డైరెక్టర్ చేస్తున్నాడు. రెండు రోజుల ప్యాచ్ వర్క్ మినహా అంతిమ్ సినిమాను 60 రోజుల్లోపూర్తిచేసేశారు. స్టార్ హీరోలు 70 నుంచి… 100 రోజులపాటు షూట్‌లో పాల్గొంటారు. సల్మాన్ మాత్రం 35 రోజులే పాల్గొని సినిమా పూర్తిచేశాడు.
అంతిమ్ సినిమాతో బావ ఆయుష్ శర్మకు క్రేజ్ తీసుకొచ్చే పనిలో వున్నాడు సల్మాన్. చెల్లెలు అర్పితాఖాన్ భర్త ఆయుష్ శర్మ నాలుగైదు సినిమాలు చేసినా గుర్తింపు రాలేదు. అంతిమ్‌లో విలన్‌గా కనిపిస్తున్నాడు. సల్మాన్ తనకు పోటీగా బావకు ఢీ అంటే ఢీ అనే రోల్ ఇచ్చాడు. ఈ ఇద్దరిపై రిలీజ్ చేసిన వీడియో ఇప్పటికే ఆకట్టుకుంది.