అలా చేయడం బాధగా అనిపించింది.. విడాకులపై స్పందించిన చైతూ..!

-

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య సమంత త్వరలో విడాకులు తీసుకుంటున్నారు అని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు విడాకులు ఫిక్స్ అని అంతే కాకుండా సమంత చైతూ నుండి భరణం గా రూ. 350 కోట్లు పుచ్చుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల పై మొదటిసారి చైతు స్పందించాడు. లవ్ స్టొరీ పమోషన్స్ కోసం ఓ ఇంటర్వ్యూ కు వచ్చిన చైతూ..కొందరు గాసిప్స్ కోసం తన పేరును వాడటం బాధగా అనిపిస్తుంది అని చెప్పాడు.

ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఉంటాయని సోషల్ మీడియాలో తనపై ఎన్నో అసత్య వార్తలు వచ్చాయని చైతూ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే వాస్తవాలు మాత్రమే ప్రజలకు గుర్తు ఉంటాయని తెలిసిన నాటి నుండి అలాంటి వార్తల గురించి పట్టించుకోవడం లేదని చైతూ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే విడాకుల పై ఇటీవల తిరుమలలో సమంత ను ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ఘాటుగా రిప్లై ఇచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news