బాబును నమ్మితే నట్టేటా మునగడం ఖాయం.. జంపింగ్ బ్యాచ్ డౌట్స్

-

ఏ పార్టీ అధికారంలో ఉంటే.. అధికారం కోసం ఆ పార్టీలోకి జంప్ అవ్వడం కామన్.. అది రాజకీయాల్లో మనం ఊహించినది.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, మరో ముగ్గురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు సిద్దమయ్యారు.. వారంతా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును నోటికొచ్చినట్లు తిట్టినవారే.. బీసీలకు, ఎస్సీలకు చంద్రబాబు చేసింది శూన్యమంటూ.. అవకాశం చిక్కినప్పుడల్లా తూర్పార పట్టారు.. కానీ ఇప్పుడు వాళ్లే టీడీపీలోకి వెళ్తున్నారు..

టీడీపీలో చేరితే..వైసీపీలో ఉన్నంత ప్రాధాన్యత ఉంటుందా అనే చర్చ పార్టీ జంప్ అయినవారిలో.. వెళ్లాలనుకుంటున్నవారిలో మొదలైందట.. 2014లో వైసీపీ వీడి.. టీడీపీలో చేరిన వారి రాజకీయ భవిష్యత్ అంధకారంలోకి వెళ్లింది.. తర్వాత జరిగిన ఎన్నికల్లో వారిలో సగానికి సగం మందికి చంద్రబాబు టిక్కెట్లే ఇవ్వలేదట.. పార్టీలో ప్రాధాన్యత కూడా ఇచ్చిన పాపానపోలేదు.. ఈ సమయంలో పార్టీలో చేరితే తమ పరిస్థితి ఏంటనే ఆలోచన వారిలో మొదలైందని వారి అనుచరులు చర్చించుకుంటున్నారు..

రాజీనామా చేసి వెళ్తున్నవారికి.. అవే పదవులు ఇస్తారనే గ్యారెంటీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవ్వలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.. మరి ఏం ఆశించి పార్టీ మారుతున్నారా అనే ప్రశ్న వారి అనుచరుల్లో ఉత్పన్నమవుతోంది.. దీంతో టీడీపీలో చేరాలనుకుంటున్న వారు కూడా ఆగిపోతున్నారట.. ఇప్పటి వరకు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులతో పాటు.. మాజీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు.. మాజీ ఎమ్మెల్యేలు మాత్రం ఏ పార్టీలో చేరకుండా సైలెంట్ గా ఉండటానికి ఇదే కారణమనే ప్రచారం జరుగుతోంది..

Read more RELATED
Recommended to you

Latest news