“నాకు డబ్బు వద్దు” మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో సమంత సంచలనం !

అక్కినేని నాగచైతన్య మరియు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. వీళ్ళ ప్రకటనతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు షాక్ కు గురైన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి సమంత… మీడియా ముందుకు రాలేదు. అటు లవ్ స్టోరీ మూవీ నేపథ్యంలో నాగచైతన్య మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఈ విడాకుల విషయంపై ఎక్కడ మాట్లాడాలి.

అయితే తాజాగా జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమానికి నటి సమంత రాబోతోంది. ఇక దీనికి సంబంధించిన ప్రోమో జెమినీ టీవీ తాజాగా విడుదల చేసింది. ఈ ప్రోగ్రాం కు “ఎవరు నీలో కోటీశ్వరులు నవరాత్రి స్పెషల్ విత్ సమంత” అని పేరు పెట్టింది జెమినీ టీవీ.

ఇక ప్రోమో విషయానికి… సీట్లో కూర్చుంటే భయంగా ఉందని సమంత చెప్పగా… అలాగే ఉంటుందంటూ ఎన్టీఆర్ తనదైన స్టైల్లో బదులిచ్చాడు. అలాగే నాకు డబ్బు వద్దు లే అంటూ సమంత పేర్కొనడం… ఆ తర్వాత… నాకు కావాలి అంటూ సరదాగా సమంత వ్యాఖ్యానించడం మనం ఈ ప్రోమో లో చూడవచ్చు. మీరు ఈ షో నుంచి వెళ్ళిపోతారా అని ఎన్టీఆర్ అడగ్గా… ముందే చెప్పాలి కదా అంటూ సమంత కాస్త సీరియస్ కావడం అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఇక ఈ ఎపిసోడ్ సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు జెమినీ టీవీలో ప్రసారం కానుంది.