షాకింగ్..మరోసారి పేరు మార్చుకున్న సమంత..!

-

చైతూతో విడాకుల తర్వాత సమంత మరోసారి తన పేరును సోషల్ మీడియా ఖాతాల్లో మార్చుకుంది. ఇదివరకు సమంత రౌత్ ప్రభు అని ఉన్న పేరును పెళ్లి తర్వాత అక్కినేని సమంత గా మార్చుతుంది. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో సమంత తన పేరును సమంత రౌత్ ప్రభు అంటూ మార్చుకుంది. ఇక నిన్న చై సామ్ లు విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి తన ఇంటి పేరును తీసేసి కేవలం సమంత గా తన పేరును మార్చుకుంది.

ఇక సమంత తన పేరును మార్చుకోవడం ఎప్పుడూ హాట్ టాపిక్ గానే నిలుస్తోంది. మొదట సమంత పేరు మార్చుకోవడం తో ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. అనుకున్నట్టుగానే సమంత చైతు నుండి విడాకులు తీసుకుంది. ఇప్పుడు మరోసారి సమంత తన పేరును మార్చుకుంది. దాంతో మళ్ళీ పేరు మార్చుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయా అని అంతా అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news