Samantha: ట్విట్ట‌ర్‌లో మార్చినా.. ఫేస్‌బుక్‌లో మార్చలేదు? ఎందుకు?

-

Samantha: టాలీవుడ్ మోస్ట్ టాలెండ్ హీరోయిన్ సమంత రూత్ ప్ర‌భు. ఏ మాయ చేశావే చిత్రంతో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ముద్దుగుమ్మ. అన‌తికాలంలోనే త‌న న‌ట‌న‌తో టాప్ హీరోయిన్‌గా నిలిచింది. ఆ త‌రువాత ఈ అమ్మ‌డు అక్కినేని వార‌సుడు నాగ చైత‌న్య‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. దీంతో స‌మంత అక్కినేనిగా మారింది. త‌న సోష‌ల్ మీడియా పేజెస్ అన్నింటిలో స‌మంత అక్కినేనిగా పెట్టుకుంది.

అయితే.. కొన్ని రోజుల క్రితం స‌మంత త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ప్రొఫైల్ పేరును మార్చి ఎస్ అని పెట్టిందో అప్ప‌టి నుండి అంద‌రిలో అనుమానాలు మొద‌ల‌య్యాయి. స‌మంత‌-నాగ‌చైత‌న్య‌లు విడిపోతున్నార‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. నిన్న ఆ అనుమానాలు నిజం చేశారు. సుమారు 11 ఏళ్ల పాటు వీళ్ల ప్రేమకు.. నాలుగేండ్ల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెట్టిన‌ట్టు సోష‌ల్ మీడియా వేదికగా ప్ర‌క‌ట‌న చేశారు. భార్య‌, భ‌ర్త‌లుగా విడిపోయిన కూడా ఇద్ద‌రం స్నేహితులుగా కొన‌సాగుతామ‌ని చెప్పుకొచ్చారు. ఈ విష‌యం .. అక్కినేని అభిమానుల‌ను క‌లచివేసింది. అస‌లు ఈ జంట విడాకులు తీసుకోవడమేంటనే ప్రశ్న అందరినీ భాద‌ప‌డుతున్నారు.

ఇదిలా ఉంటే.. తాము విడిపోతున్నమ‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత స‌మంత త‌న ట్విట్ట‌ర్‌లో ‘ఎస్’ అక్ష‌రాన్ని తొల‌గించి.. మ‌ళ్లీ ‘స‌మంత’గా మార్చేసుకుంది. ఇలా ఎందుకు చేస్తున్నావు స‌మంత అంటూ ఆమె అభిమానులు బాధ‌ప‌డిపోతున్నారు. కానీ ఫేస్‌బుక్‌లో మాత్రం ఇంకా సమంత అక్కినేనిగానే కొనసాగుతోంది. కావాల‌నే ఉంచిందా లేక మ‌రిచిపోయిందా అనే దానిపై సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు అభిమానులు.

Read more RELATED
Recommended to you

Latest news