నా కలలన్నీ చెదిరిపోయాయి..జీవితంపై ఎలాంటి ఆశ‌లు లేవు : స‌మంత‌

-

స‌మంత‌… ఈ పేరు తెలియని వారుండ‌రు. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైన స‌మంత‌.. టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే.. అక్కినేని నాగ చైత‌న్య తో విడాకులు తీసుకున్న‌ప్ప‌టి నుంచి అంద‌రూ స‌మంత‌పైనే దృష్టి సారించారు. కొంత మంది ఆమెపై సెటైర్లు పేల్చుతుంటే.. మ‌రికొంత మంది.. అండ‌గా నిలుస్తున్నారు.

ఈ నేప‌థ్యంలోనే.. త‌న కెరీర్ పై స‌మంత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల ఓ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛానెల్ కు స‌మంత ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా 2022 ప్లాన్స్ పై స‌మంత ఆస‌క్తి క‌ర వ్యాఖ్య‌లు చేశారు. ”ఈ ఏడాది లో నా క‌ల‌ల‌న్నీ చెదిరి పోయాయి. అందుకే వ‌చ్చే ఏడాది పై నాకు ఎలాంటి ఆశ‌లు లేవు. పెట్టు కోలేదు కూడా. కాలం నా కోసం ఏది రాసి పెడితే.. దాన్ని ధైర్యంగా స్వీక‌రిస్తాను. నాకు ఎలాంటి ఆలోచ‌న‌లు లేవు. నా పై ట్రోలింగ్ చేయ‌డం చాలా బాధ గా అనిపిస్తుంది.” అంటూ స‌మంత ఎమోష‌న‌ల్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news