గుప్పెడంతమనసు 315: ఎట్టకేలకు మనసులో మాట బయటపెట్టబోతున్న రిషీ..కానీ ఇంతలో దేవయాని..

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో ఉయ్యాల్లో కుర్చున్న వసూకి వెనుక నుంచి అడుగుల శబ్ధం వినపడి భయమేసి కిందకు దిగుతుంది. చూస్తే రిషీ. సార్ మీరా, మీరు ఇంకా వెళ్లలేదా సార్ అంటే..నువ్వ వెళ్లలేదని తెలిసి వెనక్కు వచ్చాను అంటాడు రిషీ. మీకు చెప్పకుండా వెళ్లిపోయాను అనుకున్నారా సార్ అంటే..అనిపించింది తెలిసి వెనక్కు వచ్చాను అంటాడు రిషీ. వసూ ఆ వెన్నెల, ఉయ్యాలను చూస్తూ..చిన్నప్పుడు ఈ వెన్నెల్లో భలే ఆడుకునే వాళ్లం సార్ అంటుంది. బాల్యాన్ని తలుచుకుంటూ తెగ సంబరిపడిపోతావ్ కదా అని రిషీ అంటే..దాదాపు అందరి బాల్యంలో అపురూపమైన జ్ఞాపకాలు ఉంటాయి కదా సార్ అంటుంది వసూ. అందరీ బాల్యాలు అలా ఉండవు వసుధార అని..భయమేయలేదా…ఒక్కదానివే వచ్చి ఉయాల ఊగుతున్నావ్ అంటే..కొంచెం భయం చాలా సంతోషం సార్..ఈ వెన్నెల అంటే చాలా ఇష్టం అంటుంది వసూ..నీకు ఇష్టం లేనివంటూ ఏం ఉండవు కదా అంటాడు. వసూ రిషీని ఉయ్యాలలో కుర్చోపెట్టి ఊపుతుంది. అలా సరదాగా వసూ ఉయ్యాల ఊపుతూ ఉంటే..రిషీ ఊగుతా ఉంటాడు..

రిషీ వసూతో ఉన్న మధుర జ్ఞాపకాలను తలుచుకుని..వసుధార నీతో ఒక మాట చెప్పాలి అనుకున్నాను..ప్రతిసారి మర్చిపోతున్నాను అంటాడు. వసూ చెప్పండి సార్ అంటుంది. రిషీ అది అది అని..చెప్పబోతాడు..ఇంతలో ఫోన్ వస్తుంది. దేవయాని కాల్ చేస్తుంది. వస్తున్నాను పెద్దమ్మా అంటాడు..రిషీ ఉయ్యాల దిగబోతూ..ఫోన్ కిందపడేస్తాడు..వసూ సార్ అనుకంటూ.. ఫోన్ తీస్తుంది. ఫోనులో వసూ గొంతు విని..వీళ్లిద్దరూ కలిసే ఉన్నారా..వీళ్ల వ్యవహారం ఎక్కడికో వెళ్తున్నట్లు ఉంది అనుకుంటుంది. వసూ ఇందాక ఏదో చెప్పాలన్నారు అంటే..రిషీ చెప్పబోతాడు..అప్పుడే పుష్పా వచ్చి కారు వచ్చింది అంటుంది. అక్కడకు వేరే అతను కూడా వచ్చి రిషీని చూసి మీరు కూడా ఉన్నారా సార్..కారులో ఒకరికే ప్లేస్ ఉంది అంటాడు.. మొత్తానికి వసూ రిషీ కలిసి వస్తారు.

ఇంకోవైపు జగతి ఇంట్లో మహేంద్ర కలిసి కాఫీ తాగుతుంటారు. నువ్వు ఎందుకు వచ్చినట్లు అని జగతి మహేంద్ర పై సీరియస్ అవుతుంది. రావాలనిపించింది వచ్చాను జగతి, అంతకు మించి పెద్ద కారణం ఏం ఉంటుంది..పోనీ వసూ వచ్చే వరకూ ఉండనా అంటాడు మహేంద్ర. వసూ వస్తుందిలే మహేంద్ర, రిషీ వచ్చేసరికి చిరునవ్వుతో నువ్వు ఎదురువస్తే ఎంత బాగుంటుంది…అని చెప్పుకొస్తుంది. మహేంద్ర గుడ్ నైట్ జగతి అని పాపం అక్కడినుంచి వెళ్లిపోతాడు.

కారులో రిషీ, వసూ వస్తుంటారు. రిషీ వనభోజన జ్ఞాపకాలన్నీ తలుచుకుంటూ ఉంటాడు. ఈరోజు నాకు చాలా బాగుంది వసుధార అంటాడు. అవును సార్..చూస్తుండగానే గడిచిపోయింది అంటుంది వసూ. ఏం ఉంటుంది లే వనభోజనాలు అనుకున్నాను కానీ చాలా బాగుంది అంటాడు రిషీ. వసూ చిన్నప్పుడు ప్రతి సంవత్సరం వెళ్లే వాళ్లం సార్..అని వసూ ఇంట్లో వాళ్లను తలుచుకుని ఎమోషనల్ అవుతుంది. ఎప్పుడు నువ్వు మీ వాళ్ల ప్రస్థావన తీసుకురావేంటా అనుకునేవాడ్ని అంటాడు రిషీ. వసూ..ఎమోషన్ లో గా మాట్లాడుతుంది. ఏదేదో మాట్లాడేస్తున్నాగా అంటే..రిషీ చెప్పు..మీ ఊర్లో సంగతలు భలే చెప్తుంటావు కదా అంటాడు. నా సంగతి వదిలేయండి సార్.. మీరు ఏదో చెప్పలన్నారు అంటే..ఇప్పుడు కాదులే అని.వసుధార నీ తెలివితేటలు, నీ లక్ష్యం, ఆఖరికి నీ మొండితనం కూడా నాకు నచ్చుతాయ్ అనుకుంటాడు. ఇంతలో కారు ట్రబుల్ ఇస్తుంది. దిగి చూస్తాడు. మనవల్ల అయ్యేలా లేదు అని సర్వీస్ సెంటర్ వాళ్లకు కాల్ చేస్తాడు. వసూ కూడా ఫోనులో ఏదో చేస్తూ ఉంటుంది.

రిషీ వాళ్లతో మాట్లాడి ఏంటి సెల్ఫీనా..లేదు సార్..మీరు అన్నాక తప్పదు అని రండి సార్ ఒకటి తీసుకుందాం అంటుంది. రిషీ వద్దు అన్నా..రండి సార్ అని ఇద్దరు సెల్ఫీ తీసుకుంటారు. ఇంట్లో దేవయాని రిషీ ఇంకా రాలేదు అని కాలుకాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. ఇంత టైం అయింది..రిషీ ఇంకా రాలేదేంటి..వసూ గొంతులానే ఉంది..వీళ్లిద్దరూ కలిసే ఉన్నారా అని టెన్షన్ పడుతుంది.

ఇక్కడ రిషీ వాళ్లు సర్వీస్ సెంటర్ వాళ్ల గురించి వెయిట్ చేస్తుంటారు. రిషీ వసుధార టెన్షన్ పడకు, సర్వీస్ సెంటర్ వాళ్లకు కాల్ చేశాం కదా వచ్చేస్తారు అంటాడు. వసూ టెన్షన్ ఎందుకు సార్..ప్రతి కష్టాన్ని ఆస్వాదిస్తాను అంటుంది. ఏంటి నీ ధైర్యం అంటే..మీరు ఉన్నారు కదా సార్ అని..అయినా మీరు లేకున్నా భయం లేదు సార్ అంటుంది వసూ. ఇలాంటప్పుడు ఈ పరిసరాలను చూసి ఎంజాయ్ చేయాలి తప్ప బాధపడి, భయపడి లాభంఏముంది సార్ అంటుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.

                                                                                                                   triveni

Read more RELATED
Recommended to you

Latest news