పాపం సమంత ని చూస్తే జాలేస్తోంది !

-

కోలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన 96 సినిమాని టాలీవుడ్ ఇండస్ట్రీలో జాను అనే టైటిల్ పేరిట రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరో శర్వానంద్ మరియు స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించడం జరిగింది. ఫిబ్రవరి 7వ తారీఖున వరల్డ్ వైడ్ గా ఈ సినిమా విడుదల చేయటానికి సినిమా యూనిట్ రెడీ అయింది. అయితే మరో వారంలో సినిమా విడుదల కావస్తున్నా గాని ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో సినిమా యూనిట్ చాలా నెమ్మదిగా వ్యవహరిస్తుంది.

Image result for samantha dull tollywood"

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ చేసిన ట్రైలర్ మినహా సినిమా డీటెయిల్స్ ఏవి కూడా బయటికి రాలేదు. ఇటువంటి తరుణంలో ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపించి సినిమా డైరెక్ట్ గా విడుదల చేయాలని మధ్యలో ఏమి కూడా ప్రమోషన్ కార్యక్రమాలు జరపకుండానే సినిమా రిలీజ్ చేయాలనే ఆలోచనలో సినిమా యూనిట్ ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.

 

దీంతో ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సమంత సినిమాకి కనీస ప్రమోషన్ కార్యక్రమాలు జాను సినిమా యూనిట్ చేయకపోవడంతో సమంత అభిమానులు పాపం సమంత అంటూ పెళ్లి చేసుకుని బుక్ అయిపోయింది అని…సమంత సినిమా పరిస్థితి చూస్తుంటే జాలేస్తుంది అని కామెంట్ చేస్తున్నారు. పైగా సినిమా కి టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అయినా గాని ప్రమోషన్ విషయంలో జాను ఎలాంటి హడావిడి చేయకపోవడంతో…సినిమా రిజల్ట్ తేడా కొట్టిందేమో అని మరికొంతమంది కామెంట్లు చేస్తు అందుకే ప్రమోషన్ విషయంలో ఖర్చు పెట్టడం లేదని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news