ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైయస్ జగన్ అనేకసార్లు విభజనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్రంగా కష్టాల్లో మునిగిపోయిందని తెలపడం జరిగింది. అంతేకాకుండా అనేక సార్లు రాష్ట్రంలో నెలకొన్న కొన్ని ఆర్థిక పరిస్థితులు గురించి వైయస్ జగన్ మాట్లాడుతూ… ఖాళీ ఖజానా ని, అప్పుల రాష్ట్రాన్ని తన చేతిలో పెట్టి చంద్రబాబు వెళ్లిపోయాడని అయినా కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పరిపాలిస్తున్నటు తెలపడం జరిగింది.
ప్రస్తుతం జగన్ ఒక పక్క సంక్షేమాన్ని మరో పక్క అభివృద్ధిని అంతే కాకుండా కొత్త కొత్త పథకాలను ప్రకటించిన నేపథ్యంలో కచ్చితంగా రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కేంద్రం తప్పనిసరిగా ఆదుకోవాల్సిందిగా కోరుతూ అనేకమార్లు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి జగన్ లెటర్లు రాయడం జరిగింది. అయితే తాజాగా కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జాతీయ హోదా కలిగిన జీవనాడి ప్రాజెక్ట్ అయినా పోలవరం విషయంలో ఇంకా అనేక విషయాలలో కేంద్రం కరనీస్తుందో లేదో టెన్షన్ లో ఏపీ ప్రభుత్వం ఉంది.
మరో పక్క తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రమైన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఎత్తిపోతల పథకం మరియు కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డ్ సమయంలో పూర్తి చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో దాదాపు 60% పైగా వ్యవసాయంపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు ను ఎలాగైనా పూర్తి చేయాలని ఒకవేళ బడ్జెట్లో పోలవరం కి నిధులు కేటాయించక పోతే దానికోసం కేంద్రం దగ్గర ఎలాగైనా నిధులు రాబట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.