స‌మంత స్ట్రైక్స్ : మంచుకొండ‌ల్లో మ‌హ‌దానందం! వైర‌ల్ వీడియో

-

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత.. అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన అనంతరం.. తన జీవితాన్ని చాలా బాగా ఎంజాయ్‌ చేస్తుంది. విహార యాత్రలు వెళుతూ.. ఫుల్‌ జోష్‌ కనిపిస్తుంది. అయితే.. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌ లోని అందమైన ప్రదేశాల్లో సమంత తన స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతోంది. తాజాగా ఈ వెకేషన్‌ ట్రిప్‌ ఫోటో ఒకటి సమంత షేర్‌ చేసింది. ”నాలుగో రోజు.. మ్యాజిక్‌. స్కీయింగ్‌ అంత ఈజీ కాదు కానీ చాలా సరదానిస్తుంది” అని ఓ ఫోటో పెట్టి ట్యాగ్ చేసింది.

ఎల్లో జాకెట్, వైట్‌ ఫ్యాంట్‌ ధరించి మంచు కొండల్లో ఆమె ఇచ్చిన ఈ ఫోజ్‌ నెటిజన్లను అట్రాక్ట్‌ చేస్తోంది. దీంతో ఈ ఫోటో నెట్టింట వైరల్‌ గా మారింది. మొత్తానికి హీరోయిన్‌ సమంత ఈ ఏడాది సరికొత్త ప్రయాణం మొదలు పెట్టింది. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేశాను, నా ఆశలు, నా ఆశాయాల వెను అనేక కష్టాలు ఉన్నా.. ధైర్యంగా ముందుకు వెళతాను” అంటూ ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సమంత చెప్పిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news