నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు దిమ్మతిరిగే సమాధాలు ఇచ్చిన సమంత..!

-

అందాల ముద్దుగుమ్మ సమంత ‘ఏం మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ రావడం మాత్రమే కాకుండా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా దక్కింది. అలా స్టార్ హీరోల సరసన నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. సమంత టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది.


వీరిద్దరికీ కొంతకాలం క్రితమే విడాకులు అయ్యాయి. సమంత విడాకుల తర్వాత తన సినిమాల స్పీడ్ ను మరింతగా పెంచింది. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేస్తున్న సమంత మరిన్ని సినిమాలను కూడా ఒక సెట్ చేసుకుంటూ వెళుతుంది. ఇందులో భాగంగా సమంత ప్రస్తుతం యశోద సినిమాల్లో నటిస్తోంది. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులకు టచ్ లో ఉంటు వారితో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. సమంత తాజాగా తన ఇన్​ స్టా అకౌంట్ పేజీలో ‘ఆస్క్​ మీ ఎనీథింగ్’​ అనే సెషన్​ను నిర్వహించింది.

ఈ సెషన్ లో భాగంగా సమంత నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇచ్చింది. ఈ సెషన్ భాగంగా ఓ నెటిజన్ సమంత ను భవిష్యత్తులో దర్శకత్వం వహించే ఆలోచన ఉందా అని ప్రశ్నించాడు. దానికి సమాధానం ఇస్తూ సమంత నేను చాలా ఆలస్యంగా నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడూ ఏది చెప్పకూడదు అని సమాధానం ఇచ్చింది. అలాగే అంతిమ లక్ష్యం ఏంటని అడిగిన’ ప్రశ్నకు ‘గుర్తుంచుకోవడం’ అంటూ సమంత సమాధానం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version