నాకు ప్రాణహాని ఉంది : సమంత పోస్ట్ వైరల్ !

-

అందాల ముద్దుగుమ్మ సమంత ‘ఏం మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ రావడం మాత్రమే కాకుండా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా దక్కింది. అలా స్టార్ హీరోల సరసన నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. సమంత టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది.

అయితే.. ఇటీవలే ఈ జంట విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి సమంతపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఆ విమర్శలను సమంత.. అదే స్థాయిలో తిప్పికొడుతోంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా నాకు ప్రాణహాని ఉందంటూ సమంత చేసిన.. ఓ పోస్ట్‌ వైరల్‌ గా మారింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్… విల్ పుస్తకం నుంచి కోట్ షేర్ చేసుకున్నారు సమంత.

“గత 30 సంవత్సరాలుగా మన అందరి లాగే ఒకటి. వైఫల్యం, నష్టం, అవమానం,మరణంతో వ్యవహరించాం. నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు లాక్‌ చేయబడింది. నా వ్యక్తిగత విషయాలను అతి క్రమించారు. నా కుటుంబం విచ్చిన్నమైంది. ప్రతిరోజూ కాంక్రీట్‌ కలిపి.. ఇటుకను పేర్చాలి. మీరు ఏ దారిలో వెళుతున్నారో తెలియదు. కానీ అక్కడ ఎల్లప్పుడూ ఒక ఇటుక మీ ముందు ఉంటుంది. అది కూడా పేర్చేందుకు ఉంది. కానీ నువ్వు ఆ ఇటుకను పేరుస్తున్నావా? అని పోస్టును సమంత షేర్‌ చేసింది. ఇప్పుడు ఆ పోస్టు వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news