Samantha : “కాతువాకుల రెండు కాదల్” నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్..

-

తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.విజయ్ సేతుపతి నటించిన సినిమాలు తెలుగులోను డబ్ అయ్యి విజయ్ మంచి విజయాలను అందుకున్నాడు.తాజాగా ఆయన నటిస్తున్న సినిమా “కాత్తు వాక్కుల రెండు కాదల్”అనే ఈ సినిమాలో నయనతార, సమంత హీరోయిన్లుగా నటిస్తున్నారు.తమిళంతో పాటు తెలుగు భాషలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఈ చిత్రానికి విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

నయనతార, విగ్నేష్ లకు చెందిన రౌడీ పిక్చర్స్ సంస్థ,7 స్క్రీన్స్ స్టూడియోస్ సంస్థ తెలంగాణ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రూపొందించిన స్వరాలు ఇప్పటికే సంగీతాభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.సినిమా బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించింది.ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.ఈ సినిమాను తెలుగులో కన్మణీ రాంబో ఖాతిజా పేరుతో విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను కూడా విడుదల చేశారు.లవ్ అండ్ కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.ఈ సినిమాలో ఇద్దరు అమ్మాయిలను ప్రేమించి అవస్థలు పడే వ్యక్తిగా సేతుపతి కనిపించారు.తొలుత ఈ చిత్రం ఓటిటి లో విడుదల కానుందని ప్రచారం బాగా జరిగింది.అయితే అవన్నీ ఊహాగానాలేనని, తమ చిత్రం థియేటర్లలోనే విడుదల అవుతుందనితమ చిత్రం థియేటర్లలోనే విడుదలవుతుందని చిత్ర బృందం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news