PUSHPA : “పుష్ప” స్పెషల్ సాంగ్ లో సమంత.. అస్సలు తగ్గేదేలే

-

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హిట్రిక్ మూవీ గా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతుండగా… అల్లు అర్జున్ సరసన ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే టాలీవుడ్ నటుడు సునీల్, జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల అవుతున్నది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరోయిన్ సమంత ఓ స్పెషల్ రోల్ చేయనున్నట్లు ప్రకటించింది పుష్ప టీం. పుష్ప లోని 5వ సాంగ్ లో సమంత ఓ స్పెషల్ రోల్ చేయనున్నట్లు పోస్టర్ విడుదల చేసింది పుష్ప టీం. అయితే ఇందులో… సమంత రూల్ అనేది క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ తాజా అప్డేట్ తో… సమంత ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version