Breaking: స్టార్ హీరో సూర్య‌ను కొడితే ల‌క్ష ఫ్రైజ్..!

-

త‌మిళ స్టార్ హీరో సూర్య‌ను కొడితే రూ. ల‌క్ష బ‌హుమానం ఇస్తామ‌ని పీఎమ్ కే పార్టీ తెలిపింది. అయితే హీరో సూర్య ఇటీవ‌ల జై భీమ్ అనే సినిమా లో న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా లో ఒక వ‌ర్గానికి చెందిన మ‌త ప‌ర‌మైన చిహ్నం ఉండ‌టం పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. దీంతో ఈ సినిమా లో ప్ర‌ధాన పాత్ర లో న‌టించిన సూర్య ను , ఆ చిత్ర బృందాన్ని కొట్టిన వారికి రూ. ల‌క్ష బ‌హుమానం గా ఇస్తామ‌ని పీఎమ్‌కే పార్టీ నేతలు చెప్పారు.

అయితే పీఎమ్‌కే పార్టీ చేసిన ప్ర‌క‌ట‌న పై సూర్య అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే ఆ వ‌ర్గానికి చెందిన వారు రాజ‌కీయం గా బ‌లం గా ఉన్న సామాజికంగా చాలా బలహీనంగా ఉన్న‌ట్టు తెలుస్తుంది. అయితే హీరో సూర్య న‌టించిన జై భీమ్ సినిమా విమ‌ర్శ‌కుల నుంచి కూడా ప్ర‌శంస‌లు అందుకుటుంది. అంతే కాకుండా ఈ సినిమా కు చాలా అవార్డు లు కూడా వ‌చ్చే అవ‌కాశం ఉందని కూడా చాలా మంది అంటున్నారు. అయితే ఇలాంటి సినిమా పై పీఎమ్‌కే పార్టీ చేసిన ఆరోప‌ణ‌ల‌కు వ్య‌తిరేకంగా చాలా మంది సినీ అభిమానులు సూర్య కు మ‌ద్దత్తు గా #WeStandWithSuriya అనే హ్యాస్ ట్యాగ్ ను ట్విట్ట‌ర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version