వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తోన్న సమంత…!

సమంత ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోట్లేదు. సినిమాలు, వెబ్‌ సీరీసులు, బిజినెసులు, టీవీ షోలు అనే తేడాలేకుండా ప్రతీ ప్లాట్‌ఫామ్‌ని ఫుల్లుగా వాడేస్తోంది. రెవెన్యూ జనరేట్‌ చేసే ప్రతీచోట కాలు పెడుతోంది. మొత్తంగా సంపాదనలో నాగచైతన్యకి టఫ్‌ కాంపిటీషన్‌ ఇస్తోంది సమంత.

పెళ్లి తర్వాత సమంత సినిమాలు తగ్గిస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ సామ్‌ పెళ్లి తర్వాతే చాలా బిజీ అవుతోంది. ఇంతకుముందు సినిమాలు మాత్రమే చేసిన సమంత, ఇప్పుడు వెబ్‌ సీరీసులు, టీవీషోలు, హోస్టింగులు, లేడీస్‌ వేర్‌ బిజినెస్.. ఇలా అదీ ఇదీ అని తేడాలేకుండా అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో అడుగుపెట్టేస్తోంది సామ్.

సమంత ఆల్రెడీ “ఫ్యామిలీమెన్‌2′ వెబ్‌ సీరీస్‌ చేసింది. ఇక సాకీ బ్రాండ్‌ పేరుతో క్లోతింగ్‌ బిజినెస్‌ కూడా చేస్తోంది. అలాగే “ఏకమ్’ పేరుతో ప్రీ స్కూల్ కూడా రన్‌ చేస్తోంది. ఇప్పుడు వీటితో పాటు టీవీ ఇండస్ట్రీలోకి వచ్చేస్తోంది సామ్. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ “ఆహా’లో ఒక టాక్‌షోకి యాంకరింగ్‌ చెయ్యబోతోంది సమంత.విశాఖపట్నం హుదుద్‌ తుఫాన్‌ బాధితులకు సాయం చెయ్యడానికి టాలీవుడ్‌ నిర్వహించిన “మేముసైతం’ ఈవెంట్‌లోనూ టాక్‌ షో చేసింది సమంత. మహేశ్ బాబు, త్రివిక్రమ్‌తో ఇంటర్వ్యూ చేసింది. రీసెంట్‌గా “బిగ్‌బాస్‌4’లో ఒక ఎపిసోడ్‌కి కూడా యాంకరింగ్‌ చేసింది. టోటల్‌గా యాక్ట్రెస్‌ కమ్ యాంకర్ కమ్ బిజినెస్‌విమెన్‌గా ఫుల్లుగా సంపాదింస్తోంది సమంత.