“ఆహా” కోసం మరోసారి రంగంలోకి సమంత..!

-

నాగచైతన్య తో విడాకుల అనంతరం సమంత కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మళ్లీ బిజీ అయిపోతుంది. సమంత ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సమంత ఓ వెబ్ సిరీస్ కు సైతం ఓకే చెప్పింది. సమంత ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో నటించిన సమంత దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యింది.

అయితే సమంత ఇప్పుడు ఆ కోసం ఒక వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆహా సమంత కోసం ఇంట్రెస్టింగ్ కథను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఆహాలో సమంత ఇప్పటికే టాక్ షో తో కూడా అలరించిన సంగతి తెలిసిందే. సామ్ జామ్ పేరుతో వచ్చిన టాక్ షో లో సామ్ పలువురు ప్రముఖుల తో ముచ్చటించింది. ఇక ఇప్పుడు మరోసారి ఆహా కోసం రంగం లోకి దిగుతోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news