సినిమాలలోనే కాదు చదువులో కూడా టాపర్ అనిపించుకున్న సమంత..ఇదిగో ప్రూఫ్..!!

-

సమంత.. ప్రస్తుతం దేశంలో పరిచయం అవసరం లేని పేరు అని చెప్పవచ్చు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా తమిళ్ సినీ ఇండస్ట్రీలో కూడా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న సమంత ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక బీ టౌన్ లో కూడా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మరింత స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకునే పనిలో ఉన్న ఈ ముద్దుగుమ్మ పాన్ ఇండియా సినిమాలలో కూడా నటిస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది. ప్రస్తుతం ఇటీవల జరిగిన ORmax సర్వేలో ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ గా సమంత గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం.

ముఖ్యంగా ది ఫ్యామిలీ మెన్ సిరీస్ తో హిందీలో కూడా పాపులర్ అయిన సమంత ఇక అక్కడ వరుస అవకాశాలను సంపాదించుకుంటుంది. దానికి తోడు ఇటీవల కాఫీ విత్ కరణ్ షో కి హాజరై బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర అయిందని చెప్పవచ్చు. ఇకపోతే తాజాగా సమంతకు సంబంధించిన ఒక విషయం మళ్ళీ నెట్టింట వైరల్ గా మారుతోంది. సమంత సినిమాలలోనే కాదు చదువులో కూడా టాపర్ అని తెలుస్తోంది. ఇక ఈమె తన స్కూలింగ్ చదువుతున్న సమయంలోనే తన స్కూల్లో టాపర్ కూడా సమంత కావడం గమనార్హం.

ఇకపోతే సమంత పదవ తరగతి మార్కు సీట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా సమంత విద్యాభ్యాసం చెన్నైలోని సి.ఎస్.ఐ సెయింట్ స్టీఫెన్ మెట్రికులేషన్ స్కూల్లో జరిగింది. ఇక ఆ స్కూల్లో సమంత టాపర్గా నిలిచినట్లు ఈ మార్క్ షీట్ తెలియజేస్తోంది. ఇకపోతే సమంత గణితంలో100 కి 100 మార్కులు, అలాగే ఫిజిక్స్ లో నూటికి 95 మార్కులు సాధించారు. ఇక అంతేకాదు స్కూల్ కి సమంత గర్వకారణం అని ప్రోగ్రెస్ రిపోర్ట్ లో టీచర్ కామెంట్ కూడా చేశారు. ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో కూడా వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version