నాగ్ బర్త్ డే : సమంత సంచలన ట్వీట్

-

టాలీవుడ్ సీనియర్ హీరో, కింగ్ నాగార్జున పుట్టిన రోజు నేడు. ఇక నాగార్జున పుట్టిన రోజు నేపథ్యంలో… టాలీవుడ్ చిత్ర పరిశ్రమ స్టార్ హీరోలు మరియు ప్రముఖులు కింగ్ నాగార్జున కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత కూడా నాగార్జున కు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలిపింది. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది హీరోయిన్ సమంత.

” మీ పై నాకున్న గౌరవం గురించి చెప్పడానికి పదాలు సరిపోవు. ఎప్పుడు అందంగా మరియు ఆరోగ్యంగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్తడే మామ ” అంటూ సమంత ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులుగా సమంత వ్యక్తిగత జీవితంపై చాలా రూమర్స్ వస్తున్న సంగతి విధితమే. నాగచైతన్య మరియు సమంత విడాకులు తీసుకుంటున్నారని చర్చ జోరుగా సాగింది. ఇందులో భాగంగానే తన ట్విట్టర్ వేదికగా అక్కినేని అనే పేరును తీసేసింది అని వార్తలు వచ్చాయి. అయితే… తాజాగా నాగార్జున పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సమంత మామ అంటూ ట్వీట్ చేసింది. దీంతో గత కొన్ని రోజులుగా వస్తున్న ఆ రూమర్స్ కి… చెక్ పెట్టినట్లు అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version