Samantha : య‌శోద గా స‌మంత తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్.. షూటింగ్ స్టార్ట్

-

విడుకాల త‌ర్వాత స‌మంత స్పీడ్ ను పెంచేసింది. వ‌రుస గా సినిమా ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ దూసుకుపోతుంది. ఇప్ప‌టి కే తెలుగు తో పాటు హిందీ లో కూడా ప‌లు సినిమా ల‌కు ఒకే చెప్పేసింది. తాజా గా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అంతే కాకుండా ఈ రోజు నుంచి షూటింగ్ ను ప్రారంభించేసింది. శ్రీ దేవీ మూవీస్ ప్రొడ‌క్స‌న్స్ లో ఈ సినిమా రూపొందుతుంది.

అలాగే శివ‌లెంక కృష్ణ ప్ర‌సాద్ ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. కాగ‌ ఈ సినిమా కు య‌శోద అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసి విడుద‌ల చేశారు. ఈ సినిమా లో సమంత ప్రధాన పాత్ర లో లేడి ఓరియంటేడ్ గా తెర‌కెక్క‌నుంది. కాగ ఈ యశోద సినిమా స‌మంత కేరీర్ లో నే తొలి పాన్ ఇండియా సినిమా గా వ‌స్తుంది. స‌మంత తొలి పాన్ ఇండియ సినిమా య‌శోద ను హ‌రి- హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాగ ఈ సినిమా పీరియాడిక‌ల్ డ్రామా గా తెర‌కెక్కునుంది.

Read more RELATED
Recommended to you

Latest news