శమరిమల అయ్యప్పస్వామికి చాలా ప్రత్యేకత ఉంది. ఆయనకు చాలా మంది భక్తులు కూడా ఉన్నారు. అయ్యప్ప అంటే ఠక్కున గుర్తుకువచ్చేది 18 మెట్లు. పదునెట్టాంబడి. అయితే అయ్యప్ప దీక్ష తీసుకున్నది మొదలు ఇడుముడి దేవుడికి సమర్పించేవరకు చేసే ఈ యాత్రను చేయదలచిన వారు అత్యంత శ్రద్ధా భక్తులతో కొన్ని కఠోర నియమాలను పాటించాల్సి ఉంటుంది.
ఇది ఇలా ఉండగా.. ఇప్పటికే శమరిమల అయ్యప్పస్వామి మాలలు ప్రారంభం అయ్యాయి. దాదాపు 40 రోజులకు పైగా శమరిమల అయ్యప్పస్వామి మాలలు వేస్తారు. ఇక ఈ నేపథ్యంలోనే, ఈ నెల 16 నుంచి శమరిమల అయ్యప్పస్వామి దర్శనం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీ వరకు అయ్యప్పస్వామి దర్శనం ఉండనుంది.