అమెజాన్ ఇండియా హెడ్ గా సమీర్ కుమార్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ తాజాగా ప్రకటించింది. అక్టోబర్ 01వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిపింది. మాజీ హెడ్ మనీష్ తివారి రాజీనామా తరువాత ఆ స్థానంలో సమీర్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారని వెల్లడించింది. సమీర్ కుమార్ 1999లో అమెజాన్ లో చేరారు.
అయితే 2013లో Amazon.in ను తీసుకొచ్చిన బృంద సభ్యులలో ఈయన కూడా ఒకరిగా ఉన్నారు. అమెజాన్ వ్యాపార విభాగంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుంది. భారత్ లోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆసక్తిగా ఉన్నాం. Amazon.in తీసుకురావడంలో సమీర్ కుమార్ కీలక పాత్ర పోషించారని అమెజాన్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ పేర్కొన్నారు. అమెజాన్ ఇండియా హెడ్ గా ఉన్న మనీష్ తివారి ఆగస్టు 06, 2024న తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి బయట ఇతరత్రా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి రాజీనామా చేశారు తివారీ. ఆయన స్థానంలో ప్రస్తుతం సమీర్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు.