వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగిందని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. నిమజ్జనం కోసం 25వేల పోలీసు సిబ్బంది షిఫ్టుల ప్రకారం 40 గంటల పాటు విధులు నిర్వహించారన్నారు.పోలీసులతో పాటు బల్దియా,ట్రాన్స్ కో, మున్సిపల్ సిబ్బంది సైతం తీవ్రంగా శ్రమించారని గుర్తుచేశారు. నిమజ్జనం కోసం కష్టపడిన వారికి సీవీ ఆనంద్ కృతజ్ఞతలు తెలిపారు.బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కొన్ని ప్రాంతాల్లో అర్థరాత్రి తర్వాత కూడా శోభాయాత్రను నిర్వహించారని, బేగంబజార్ ఛత్రి, అబీబ్ నగర్ వంటి ప్రాంతాల్లో నిమజ్జనాలు త్వరగా పూర్తి చేయాలని కోరినా కొందరు వినిపించుకోలేదని, ఆ మండప నిర్వాహకులతో మళ్లీ మాట్లాడుతున్నామన్నారు.
కాగా, మంళవారం ట్యాంక్ బండ్‌లో 5,500 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, అనధికారికంగా ఇతర కమిషనరేట్ల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా కొన్ని విగ్రహాలు వచ్చాయన్నారు. దాంతో మరింత ఆలస్యం జరిగిందన్నారు.కొన్ని విగ్రహలు అంచనాలకు మించి ఎత్తులో రావడం, కొన్ని చోట్ల కండీషన్లలో లేని వాహనాలు బ్రేక్ డౌన్ కావడం వల్ల శోభాయాత్రకు ఆలస్యం వాటిల్లిందన్నారు. ఈ ప్రక్రియ సజావుగా సాగితే నేటి ఉదయం 8 గంటల లోపు నిమజ్జన కార్యక్రమం పూర్తిగా ముగించే వారమన్నారు.