శాంసంగ్ గ‌ణేషోత్స‌వ్ సేల్‌.. త‌క్కువ ధ‌ర‌ల‌కే ఎలక్ట్రానిక్ వ‌స్తువులు..!

-

ఎల‌క్ట్రానిక్స్ త‌యారీ సంస్థ శాంసంగ్ వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా గ‌ణేషోత్స‌వ్ సేల్‌ను నిర్వ‌హిస్తోంది. ఈ సేల్ ఇప్ప‌టికే ప్రారంభం కాగా ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఇందులో భాగంగా క‌స్ట‌మ‌ర్లు క్యాష్‌బ్యాక్‌, ఈఎంఐ ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. క్యూలెడ్ టీవీలు, స్మార్ట్ టీవీలు, రిఫ్రిజిరేట‌ర్లు, వాషింగ్ మెషిన్లు, స్మార్ట్ ఓవెన్లు, ఏసీల‌పై త‌గ్గింపు ధ‌ర‌ల‌ను, ఆఫ‌ర్ల‌ను అందిస్తున్నారు.

samsung ganeshotsav sale offers discounts on electronics

శాంసంగ్ క్యూలెడ్ 8కె టీవీని కొన్న‌వారికి గెలాక్సీ ఎస్‌20 ప్ల‌స్ ఫోన్‌ను ఉచితంగా ఇస్తారు. 10 ఏళ్ల వ‌ర‌కు నో స్క్రీన్ బ‌ర్న్‌-ఇన్ వారంటీని ఇస్తారు. స్మార్ట్‌టీవీల కొనుగోలుపై రూ.1500 వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. నెల‌కు రూ.990తో ఈజీ ఈఎంఐ ఆప్ష‌న్ల‌ను పొంద‌వ‌చ్చు. 43 ఇంచులు.. అంత‌క‌న్నా ఎక్కువ సైజ్ ఉన్న టీవీల‌పై ఈ ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు.

శాంసంగ్ స్పేస్ మ్యాక్స్ ఫ్యామిలీ హ‌బ్ రిఫ్రిజిరేట‌ర్‌ను కొన్న‌వారికి గెలాక్సీ నోట్ 10 లైట్ ఫోన్‌ను ఉచితంగా ఇస్తారు. ఈ ఫ్రిజ్‌పై కూడా 15 శాతం వ‌ర‌కు క్యాష్ బ్యాక్ పొంద‌వ‌చ్చు. రూ.990తో ఈజీ ఈఎంఐ ఆప్ష‌న్ల‌ను అందిస్తున్నారు. 300 లీటర్ల కెపాసిటీ ఉన్న ఫ్రిజ్‌ల‌ను కొంటే ఒక ఈఎంఐని మాఫీ చేస్తారు.

శాంసంగ్ ఏసీల‌పై 15 శాతం వ‌ర‌కు క్యాష్ బ్యాక్‌, ఈజీ ఈఎంఐల‌ను పొంద‌వ‌చ్చు. కండెన్స‌ర్, పీసీబీ కంట్రోల‌ర్‌‌పై 5 ఏళ్ల వారంటీని, డిజిట‌ల్ ఇన్వ‌ర్ట‌ర్ కంప్రెస‌ర్‌పై 10 ఏళ్ల వారంటీని పొంద‌వ‌చ్చు. అలాగే 28 లీట‌ర్లు అంత‌కు మించి కెపాసిటీ ఉన్న స్మార్ట్ ఓవెన్ల‌ను కొంటే ఉచితంగా బోరోసిల్ కిట్‌ను అందిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news