ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ దేశంలోని తన కస్టమర్లకు వాట్సాప్‌లో కస్టమర్ సర్వీస్ సేవలను ప్రారంభించింది. శాంసంగ్‌కు చెందిన ఏ ప్రొడక్ట్‌ను వాడేవారు అయినా సరే.. వాట్సాప్ సపోర్ట్ నంబర్.. 1800-5-SAMSUNG లేదా 1800-5-7267864 ను తమ ఫోన్లలో సేవ్ చేసుకోవచ్చు. అనంతరం అందులో మెసేజ్‌లను పంపడం ద్వారా కస్టమర్ సర్వీస్ సేవలను పొందవచ్చు.
శాంసంగ్‌కు చెందిన ఏ ప్రొడక్ట్‌ను వాడేవారు అయినా సరే.. ఆ నంబర్‌కు మెసేజ్‌లు పంపితే కస్టమర్ సర్వీస్ వారు స్పందించి వినియోగదారులకు ఉండే సమస్యలను పరిష్కరిస్తారు. అలాగే టెక్నికల్ సహాయం అందజేస్తారు. ఆయా ప్రొడక్ట్స్‌లో వచ్చే సమస్యలను వినియోగదారులు తమ సొంతంగా పరిష్కరించుకునే నైపుణ్యం కలిగి ఉంటే వారికి సాంకేతిక సహాయం అందజేస్తారు. ఇక ఆ సదుపాయం పొందలేని వారికి దగ్గర్లో ఉండే శాంసంగ్ కస్టమర్ సర్వీస్ సెంటర్ల వివరాలను అందజేస్తారు.
శాంసంగ్ ప్రారంభించిన ఈ వాట్సాప్ కస్టమర్ సర్వీస్ నిత్యం పనిచేస్తుంది. నిత్యం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇందులో కస్టమర్లు తమ శాంసంగ్ ప్రొడక్ట్స్‌కు చెందిన అనేక వివరాలను తెలుసుకోవచ్చు. సర్వీస్ రిక్వెస్ట్‌లు పెట్టవచ్చు. తమ ప్రొడక్ట్‌ల రిపేర్ ఎంత వరకు వచ్చిందో స్టేటస్ కనుక్కోవచ్చు. అలాగే రిమోట్ సపోర్ట్, ఫోన్ డయాగ్నస్టిక్స్, లైవ్ చాట్, ఆఫర్స్ తదితర సేవలను పొందవచ్చు. దీంతోపాటు కొత్త ప్రొడక్ట్‌లను కొనుగోలు చేస్తే వాటి డెమో కోసం రిక్వెస్ట్ పెట్టవచ్చు. ఆయా ప్రొడక్ట్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు కూడా రిక్వెస్ట్‌లు పెట్టవచ్చు.