బ్రో మూవీ కోసం అదిరిపోయే ప్లాన్ చేసిన సముద్రఖని..!

-

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వస్తున్న తమిళ రీమేక్ చిత్రం బ్రో సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 28వ తేదీన విడుదలకు సిద్ధం కాబోతోంది. ఇదిలా ఉండగా టైం విలువ అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం రాబోతుండగా దేవుడికి కూడా టైం కావాలి.. టైం బాగోలేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు..

అన్నిటికంటే ముఖ్యం టైం మాత్రమే అనే కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ గా మారుతోంది. అదేమిటంటే ఏకంగా ఈ సినిమాను 12 భారతీయ భాషలలో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట ప్రముఖ దర్శకుడు సముద్రఖని.. టైం విలువ అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో ఇండియాలో అందరికీ తెలిసేలా ఈ సినిమాని 12 భాషల్లో విడుదల చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే హిందీలో రీమేక్ ఫైనల్ జరిగింది అని.. అక్కడ కూడా ఈయనే దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం.

మరొకవైపు ఒరియా, కన్నడ, మలయాళం , భోజ్ పురి, మరాఠీ ఇలా అన్ని భాషల్లో కూడా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక బడ్జెట్తో సంబంధం లేకుండా ఎంత తక్కువ ఇచ్చిన పర్వాలేదు సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నారు సముద్రఖని. దీంతో ఇప్పుడు కాస్త ఇది హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా సముద్రఖని ఆలోచన వర్క్ అవుట్ అవుతుందని.. తప్పకుండా అన్ని భాషల్లో రీమేక్ చేయాలి అని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news