మేం చాటలు, చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో పవన్ – పోతుల సునీత

-

మేం చాటలు, చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో పవన్ అంటూ వైసీపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత హెచ్చరికలు చేశారు. వాలంటరీ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు హేయమైనవని.. నరేంద్ర మోడీ సైతం వాలంటరీ వ్యవస్థను మెచ్చుకున్నారన్నారు. కరోనా సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు దేశానికే ఆదర్శమని.. చంద్రబాబు,లోకేష్ లకు రాజకీయాలు చేసే దమ్ములేక పవన్ ను అడ్డం పెట్టుకుంటున్నారని తెలిపారు.

పవన్ కళ్యాణ్ కు ఇదే మా హెచ్చరిక… మేం చాటలు.. చెప్పులు ఎత్తితే నీ గతేంటో తెలుసుకో అని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్… మహిళలకు, వాలంటీర్లకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పవన్..చంద్రబాబేనా నీ కేంద్ర నిఘా సంస్థ అని మండిపడ్డారు. చంద్రబాబు నీ చెవిలో ఊదితేనే ఇవన్నీ మాట్లాడుతున్నావని ఫైర్‌ అయ్యారు. పవన్ వంటి వ్యక్తులు ఈ రాష్ట్రంలో యాత్రలు చేయడానికి లేదన్నారు. పవన్ను అరెస్ట్ చేయమని డీజీపీని కోరామన్నారు వైసీపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత.

Read more RELATED
Recommended to you

Latest news