పురుషులతో సమానంగా మహిళలకు ఆస్థి హక్కు వారసత్వంగా ఇస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై చంద్రబాబు, నారా లోకేష్ లు ట్విట్టర్ లో తమ స్పందన తెలియజేశారు. చాలా గొప్ప నిర్ణయం అని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పంటే ఇప్పుడు ఇచ్చిందికానీ… అంతకంటే చాలా ముందే టీడీపీ దీన్ని అమల్లో పెట్టిందని గొప్పలు చెప్పుకున్నారు. దీంతో… సంచయిత స్పందించారు.. కరెక్టుగా టైం చూసి చంద్రబాబుని కడిగేశారు!
తాజాగా ట్విట్టర్ లో స్పందించిన సంచయిత.. చంద్రబాబు ట్వీట్లకు రీ ట్వీట్లు చేస్తూ… “శ్రీ చంద్రబాబు మహిళల హక్కుల విషయంలో మీరు ఛాంపియన్ అయితే.. కాస్త అలా వెళ్లి మీ శ్రీ అశోక్ గజపతి కి చెప్పండి. సింహాచలం, మాన్సాస్ మొదటి మహిళా ఛైర్ పర్సన్ అయిన నాపై దాడిచేయొద్దని.. నేను ఆయన అన్నగారి పెద్ద కుమార్తెను, వారసురాలిని. ఆవిషయాన్ని గుర్తించిన సీఎం జగన్ గారికి ధన్యవాదాలు.” అని అన్నారు!
తాను మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ అయితే… “ఏ హోదాలో అవుతారు, ఆడబిడ్డలకు ఈ పదవిలో కూర్చునే అర్హత లేదు” అన్నట్లుగా తన బాబాయి అశోక్ తో పాటు, చంద్రబాబు మాట్లాడిన సంగతిని సంచయిత గుర్తుచేస్తున్నారు. ఆడపిల్లలు అన్నింటా సమానమని ఇపుడు గట్టిగా చెబుతున్న బాబుకు తాను మాన్సాస్ చైర్ పర్సన్ అయితే మాత్రం ఎందుకు అభ్యంతరమని సూటిగా ప్రశ్నిస్తున్నారు! దీంతో… సంచయిత టైమింగ్ అదిరింది అంటూ ఆన్ లైన్ లో కామెంట్లు పడుతున్నాయి!!