ఇసుక అక్రమ రవాణాలో తొలి శిక్ష.. కడప జిల్లా వ్యక్తికి మూడేళ్ల జైలు శిక్ష

-

ఇసుక అక్రమ రవాణా చేస్తే రెండేళ్ల జైలుశిక్ష తోపాటు రూ.2 లక్షల జరిమానా విధించేలా చట్ట సవరణ చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కొద్ది రోజులకే తొలి తీర్పు వెల్లడైంది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గోపరాజుపల్లెకు చెందిన వ్యక్తికి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించింది. జులై 15న ఎస్సై భక్తవత్సలం గ్రామ సమీపంలోని పాపాగ్ని నది నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్‌లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న వారిని పట్టుకున్నాడు.

ఈ కేసులో గోపరాజుపల్లెకే చెందిన నిందితుడు నంద్యాల సుబ్బారాయుడిపై కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన రెండో అదనపు జిల్లా మెజిస్ట్రేట్ నిందితునికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news