– 297 సంవత్సరాలకొకమారు ఈ నక్షత్రంలో దేవ, రాక్షస గురువుల కలయిక
– సాయం సంధ్యానంతరం ఈ అరుదైన దృశ్యాలు కనువిందు చేయనున్నాయి.
ఆకాశంలో నిత్యం ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. కానీ వాటిలో మనకు పనికివచ్చేవి చాలా తక్కువ. అంతరిక్షంలో జరిగే అద్భుతాలు చాలావరకు మనం పట్టించుకోం.కానీ నవంబర్ 23, 24, 25న జరిగే సంఘటనలు మనందరికీ సంబంధించినవి. ఆధ్యాత్మిక ప్రపంచంతో సంబంధం ఉన్నవారే కాకుండా సైన్స్ పట్ట ప్రీతి ఉన్నవారికి ముఖ్యమైన రోజులు ఇవి. ఈ మూడురోజులు ఆకాశంలో నైరుతి దిక్కులో సాయంత్రం సంధ్యసమయం ముగియగానే ఈ అద్భుతం ఆవిష్కరణ జరుగనున్నవని ప్రముఖ జ్యోతిష పండితుడు, పంచాగకర్త శ్రీగార్గేయ శ్రీనివాస్ తెలిపారు.
నవంబర్ 23న గురు, శుక్రులు దగ్గరకు వస్తారు. గురువు తక్కువ కాంతితో పైన, శుక్రుడు ఎక్కువ కాంతితో కింద కన్పిస్తాడు. తర్వాతి రోజు అంటే నవంబర్ 24న గురు, శుక్రులు ఒకరికొకరు ఆలంబన అవుతారు. అంటే ఇద్దరు ఒకే రేఖపై ఓవర్‌ల్యాపింగ్ అయి ఒక్కరిగా కన్పిస్తారు (కొన్ని ప్రాంతాల్లో ఈ ఘటన కన్పిస్తుంది). అనంతరం నవంబర్ 24న శుక్రుడు పైన, గురువు కింద కన్పిస్తారు. వీరిద్దరు మూల నక్షత్రంలో కలవడం చాలా అరుదు. దేవగురువు అయిన బృహస్పతి (గురువు), రాక్షస గురువు అయిన శుక్రాచార్యులు ఇద్దరి కలయిక పలు రాశులకు శుభప్రదం.
ఈ సమయంలో ఏం చేయాలి?
– ఈ అరుదైన అద్భుతమైన దృశ్యం కన్పిస్తున్న సమయంలో భక్తితో గురు, శుక్రులకు నమస్కారం చేసుకుని వారికి మన కోరికలను విన్నవించుకుంటే మంచిది అని పండితుల అభిప్రాయం. అదేవిధంగా సృష్టికర్త లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తూ ఈ అరుదైన అంతరిక్ష అద్భుతాన్ని వీక్షిస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి. సైన్స్ ప్రియులకు ఇదొక అపురూపమైన దృశ్యం. సాయంత్రం సంధ్యాసమయం అయిపోయిన వెంటనే కేవలం 30 – 60 నిమిషాల వ్యవధిలో ఈ సంఘటనలు నైరుతి దిక్కులో ఆకాశాన కన్పిస్తాయి.
– కేశవ