యంగ్ హీరోయిన్ తో లవ్ లో పడ్డ సందీప్ కిషన్..!

-

ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరో హీరోయిన్లు సినిమాలలో నటిస్తున్నప్పుడు లేదా ఇతర సందర్భాలలో వారి మధ్య స్నేహం మొదలవడం సహజం. అయితే అది లవ్ , రిలేషన్ , సహజీవనం, పెళ్లి , విడాకులు అంటూ ఏది జరిగినా కూడా ఎంత దూరం వెళ్లినా అది వారి వ్యక్తిగత జీవితం కాబట్టి.. అందులో మనం వేలు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు.. కానీ సెలబ్రిటీలు కాబట్టి వీరికి సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా క్షణాలలో వైరల్ అవుతూ ఉంటుంది.. కొంతమంది డైరెక్టుగా బహిర్గతం అయితే మరికొంతమంది ఇన్ డైరెక్టుగా హింట్ ఇస్తున్నారు.

ఒకవేళ ఇండైరెక్టుగా వీరిచ్చే హింట్ వల్ల చాలామంది రకరకాల వార్తలను క్రియేట్ చేస్తూ ఓ రేంజ్ లో ఆ వార్తను స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ రెజీనాల మేటర్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా డిసెంబర్ 13వ తేదీన చెన్నై ముద్దుగుమ్మ రెజినా కసాండ్రా తన 32వ పుట్టినరోజును జరుపుకుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ ఆమెకు బర్తడే విషెస్ చెప్పాడు.

అయితే ఇందులో ఏముంది స్పెషల్ అని అనుకుంటే పొరపాటే.. “లవ్ యూ” అనే మాట కూడా వాడాడు.. దీంతో సందీప్ కిషన్ , రెజీనా కసాండ్రాతో ప్రేమలో పడిపోయాడా అనే వార్తలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. రోటీన్ లవ్ స్టోరీ, రారా కృష్ణయ్య వంటి సినిమాలలో వీరిద్దరూ కలిసి నటించిన విషయం తెలిసిందే. అప్పట్లోనే వీరిద్దరి మధ్య స్నేహం, సంథింగ్ సంథింగ్ అనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు సందీప్ కిషన్ తనతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయడంతో నిజంగానే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు బహిర్గతం అవుతున్నాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెట్టాలి అంటే ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news