“వారసుడు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ !

-

వారసుడు అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు విజయ్ దళపతి. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మూవీ యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే, టాలీవుడ్‌ ఈ సినిమాను వ్యతిరేకిస్తోంది.

సంక్రాంతి ఈ సినిమాను విడుదల చేయకూడదని దిల్‌ రాజ్‌ కు వార్నింగ్‌ ఇస్తున్నారు తెలుగు నిర్మాతలు. అయితే.. వీటన్నిటినీ లెక్క చేయకుండా… సంక్రాంతికే సినిమాను రిలీజ్‌ చేస్తామని మరోసారి దిల్‌ రాజ్‌ టీం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే, ఈ మూవీ పై హైప్ పెంచేందుకు ఈనెల 24న చెన్నైలో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. దీని తర్వాత తెలుగులోను ఈ నెల 27న పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ వేడుకకు ప్లాన్ చేస్తున్న దిల్ రాజు, ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ముఖ్యఅతిథిగా ఆహ్వానించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news