సానియామీర్జా చెల్లెలి పెళ్లి… వరుడు అత‌డేనా..

-

టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా ఇంట పెళ్లి సందడి నెలకొంది. సానియా చెల్లెలు ఆనమ్‌ మీర్జా వివాహ నిశ్చితార్థం కూడా జ‌రిగిన‌ విష‌యం తెలిసిందే. ఇక వ‌రుడు విష‌యానికి వ‌స్తే.. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలైన ఆనంమీర్జాను భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు అసద్ పెళ్లాడనున్నట్లు సమాచారం. అసద్,ఆనందమీర్జాల వివాహం ఈ ఏడాది డిసెంబరులో స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో జరగనుందని వెల్లడైంది.

గతంలో ఆనం, అసద్ లు చెట్టాపట్టాలేసుకొని తిరగడంతో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ పుకార్లు షికారు చేశాయి. ఎట్టకేలకు ఆనంమీర్జా తాను కాబోయే వధువు అంటూ తన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆనంమీర్జా ఫ్యాషన్ స్టైలిస్టుగా ‘లబేల్ బజార్’ పేరిట ఫ్యాషన్ ఔట్ లెట్ నిర్వహిస్తున్నారు. అజారుద్దీన్ కుమారుడైన అసద్ వర్థమాన న్యాయవాది. వీరిద్దరి వివాహంతో రెండు క్రీడా కుటుంబాల మధ్య ఉన్న స్నేహం కాస్తా బంధుత్వంగా మారనుంది.

Read more RELATED
Recommended to you

Latest news