ఆంధ్రప్రదేశ్ లో దీపావళి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పథకంపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. ఉచితంగా గ్యాస్ సిలిండర్లను ఇస్తూ.. తెరవెనక ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్ వేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేదల కుటుంబాలలో దీపం పెట్టామని గఫ్ఫాలు కొట్టుకుంటున్న కూటమి ప్రభుత్వం.. విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతుందని విమర్శించారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఎక్స్ వేదికగా ఆమె కూటమి ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రశ్నించారు.
“3 సిలిండర్లు ఉచితంగా ఇస్తూ పేద కుటుంబాల్లో దీపం పెట్టామని గఫ్ఫాలు కొట్టుకుంటున్న కూటమి సర్కార్… విద్యుత్ సర్దుబాటు చార్జీలతో మరోవైపు వాతలు పెడుతోంది. “ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం అంటే” ఇదే మరి. ఉచిత సిలిండర్ల పథకం కింద ఏడాదికి ఇచ్చేది రూ.2685 కోట్లు.. ప్రజల దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపంలో ముక్కుపిండి అదనంగా వసూలు చేసేది రూ.6వేల కోట్లు. ఇంకా రూ.3వేల కోట్లు ప్రజలపైనే అధనపు భారం పడుతుంది కదా .
దీపం – 2 కింద వెలుగులు పక్కన పెడితే .. కరెంటు బిల్లుల రూపంలో కుటుంబాల్లో కూటమి ప్రభుత్వం నింపేది కారు చీకట్లు. గత వైసిపి చేసిన పాపమే ఇదని, ఈ ప్రభుత్వానికి సంబంధం లేదని, బిల్లుల వసూళ్లకు అనుమతి ఇచ్చింది APERC తప్ప.. మేము కాదని, చెప్తున్నవి కుంటి సాకులు తప్ప మరోటి కాదు. గత ప్రభుత్వం 9 సార్లు చార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని, అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు చార్జీలు పెంచిందని, తాము అధికారంలోకి వచ్చాక.. ఒక్క రూపాయి కూడా అదనపు భారం మోపమని, అవసరం అయితే 35 శాతం చార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో 9 సార్లు చార్జీలు పెంచితే, మీరూ మొదలుపెట్టారు కదా.
మీకు వాళ్లకు ఏంటి తేడా ? 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ.35 వేల కోట్లు ప్రజలపై భారం మోపితే, మీరు కూడా భారం మోపడం మొదలు పెట్టారు కదా. మీకు వాళ్లకు ఏంటి తేడా. రూ.6వేల కోట్లు ప్రజలపై మోపడం భావ్యం కాదు. బీజేపీ కి మద్దతు ఇస్తున్నారు కదా… సాయం తీసుకురండి. ప్రభుత్వమే ఈ భారం మోయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలపై సర్దుబాటు చార్జీల భారాన్ని మోపినందుకు నిరసనగా ఈ నెల 5 న, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిస్తుంది” అని ట్వీట్ చేశారు.