తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్ ను స్వీకరించారు. తాజాగా భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను టెన్నిస్ స్టార్ సానియా మిర్జా స్వీకరించారు.
ఈ మేరకు ఆమె సోమవారం ఫిలింనగర్ లోని తన కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ కు ఛాలెంజ్ చేశారు. అలాగే ప్రజలందరిని మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారని కొనియాడారు.
I've accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge
from @Pvsindhu1 Planted 3 saplings Further I am challenging to
@azharflicks @jayesh_ranjan @NSaina
to plant 3 trees & continue the chain..spl thanks to @MPsantoshtrs garu for taking this intiative pic.twitter.com/5LoXFRZrXp— Sania Mirza (@MirzaSania) June 22, 2020